పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/588

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

522

ద్విపద భారతము.


ఎన్నిమాఱులు పాఱవెదిరింపలేక !
మున్నుగా; నీవు సముద్రంబులోన
దుర్గంబుగట్టుకు తులఁజరించితివి ;
దోర్గర్వముస మిమ్ముఁ దూలఁదోలెదను.
మొక్కలంబున మీరు ముప్వురుఁగూడి
యెక్కటికయ్యాన కెత్తివచ్చినను,
రయమున మీతోడ రణమొనర్చెదను
నియమింపఁ; గా దేని నిఖిలసైన్యములఁ
గూడుకరమ్మన్నఁ గొసరక వత్తు
నోడక ; యటుగాక, యొక్కండవీవు
రమన్న రణము తీవ్రముగఁ జేసెదను;
ఇమ్ముల మీతోడ నేయాయుధములఁ
జెనకంగవలసినఁ జెండివై చెదను. "
అనవుడు శ్రీకృష్ణుఁ డప్పుడిట్లనియె:
"పలువురొక్కనితోడఁ [1]బ్రధనంబు సేయ
నిలనధర్మము; గాన నిపుడు మాయందు
నొకనితో రణముసేయుము, ప్రతాపమున ;
నకలంకగతియందు నతిధర్మమునను
మల్లయుద్ధంబు సమంబుగావునను
దెల్లముగాఁ బోరు ధీరత్వమునను.
సృష్టివారికిఁ గీడుసేయ నేనంటి;
దృష్టమిప్పుడు ధరిత్రీపాలతతులఁ
జెఱఁబెట్టితివి; సదా శివహితార్థముగ
వెఱవక చంపంగ వేగఁబూనితివి ;
ఎవ్వరు హరునకు నిల జీవహింస
యివ్విధంబునఁ జేయ రేయుగంబునను;
ఇది యధర్మముగాదె యిల నీదుచేఁత !
తుది మహాశౌర్యవంతుఁడనని క్రొవ్వి

  1. బ్రదరము. (మూ)