పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/585

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

519


గౌతమమునిచేతఁ గడురమ్యమైన
పూతదుర్గంబిది భువినసాధ్యంబు.
తెరల మాగధుని సాధింపంగలేరు
దురములో." ననిచెప్పి తుదిఁజైత్యనగము
దండకుఁ జేరి మోదముననిట్లనియెఁ:
"జండభేరులు మూఁడు చాలనొప్పారు;
మగధాది[1]నాథులు మానుషాదమను
అగణితవృషభంబు నణఁగించి, దాని
చర్మంబు భేరుల సరవిమూయింప,
నిర్మిలినీపురి నటు వింతవారు
చొచ్చినప్పుడు మ్రోయుచును మునిశక్తి
నిచ్చలో నెఱిఁగించు నిట మగధునకు.”
అనిన వారలు చూచి హస్తదండముల
ననువార భేరీత్రయంబును జించి,
వారకుద్ధతి గిరివ్రజమర్థిఁ జొచ్చి,
బోరన నప్పుడు పుష్పలావికల
సదనంబునకుఁబోయి సకలపుష్పములు
ముదముతో నిమ్ముల ముడిచి, గంధములు
మేననిండుగఁబూసి, మేటిగంధమున
మానుషంబున రాజమార్గంబుచేరి,
గుహలుచొచ్చుమృగేంద్రకులముచందమున
మహనీయులై చొచ్చి మఱియు వచ్చుటయు,
నాజరాసంధుండు నర్ఘ్యపాద్యములు
తేజంబుతోఁగొంచు ధృతినెదురేఁగి

  1. నాథునిమాషదంబనెడి. (మూ) చాలవఱకు గవిత్రయభారతముననుసరించి యీ
    ద్విపదభారతము వ్రాయబడుటచే, లేఖకప్రమాదాదులవలనిదొసఁగలు సవరించుటలో అదియే ఆధారముగా దీసికొనబడెను.