పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/531

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; అష్టమాశ్వాసము

465


కొడుకుపెండ్లికి నిట్లు గోత్రారివచ్చి,
కడువేడ్కఁ బురముశృంగారింపఁబనిచె.
ఈరీతివచ్చిన యింద్రాదులకును
శౌరి పూజలు చేసి సంభ్రమంబునను,
చారులగ్నము బృహస్పతి నిర్ణయింప,
నారూఢి దేవతూర్యములు ఘోషింప,
విహిత యాజకతంత్ర విరచనయందు
బహుభంగిఁ గశ్యపబ్రహ్మ వర్తింప,
శచి యరుంధతి రతి సత్యభామయును
నచట సుభద్ర కల్యాణంబుపాడ,
మునిజనాశీర్వాదములు మిన్నముట్ట
వనితఁ గవ్వడికి వివాహంబు సేసి,
వరుసఁబూజించి దేవతులవీడ్కొలిపి,
పరమానురాగుఁడై పద్మనాభుండు
రత్న కేయూర హారములు పార్థునకు
యత్నంబుతోనిచ్చి యతనికిట్లనియె:
"అర్జున, [1]మనసైనయట్టికార్యంబు
నూర్జితంబయ్యె వేయును నేలమనకు;
ఇదియెఱుంగనియట్టు లిదె నాకు బలుఁడు
మొదలైనయదుబలంబులకుం బోవలయుఁ;
గోమలి నీవుతోడ్కొనిపొమ్ము లెమ్ము;
తామసంబయ్యె యాదవులు వచ్చెదరు.”
అని రథ్య కేతు శస్త్రాస్త్రసంపదల
ననువైనయరదంబు హరిసూతికొసగి
యనిపి, గృష్ణుఁడు వేగ యాదవులున్న
మునుమున కేతెంచె మునిమ్రుచ్చువోలె.

  1. మనమైన మెట్టి (మూ)