పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తిమ్మయకవి వల్లభసూరికుమారుడు; కాశ్యపసగోత్రుడు. అన్నియాశ్వాసములతుదిని గద్యస్థానీయములైన ఈ క్రింది ద్విపదపంక్తులు పైవిషయములకాధారము :

ఇది సదాశివభక్త హితగుణాసక్త - సదయస్వరూప కాశ్యపగోత్రదీప

శ్రుతిపాత్ర వల్లభసూరిసత్పుత్త్ర - మతిమద్విధేయ తిమ్మయనామధేయ

రచిత... సర్వ నిర్మలకథయందు - నుచితమై యాశ్వాస....మయ్యె``

ఈ కవి నివాసస్థలము నెల్లూరు మండలములోని బట్టేపాడు గ్రామమనియు, ఇంటిపేరు బట్టేపాటివారనియు నూహించుటకు గొంతయాధారము దొరకినది. పుష్పగిరి తిమ్మయకు సమకాలికుడును సహశ్రోతియునగు తేకుమళ్ళ రంగశాయియను కవి తన ద్విపద భాగవతములో (అముద్రితము) పూర్వ కవిస్తుతి యొనర్చు సందర్భమున, ఈ ద్విపద భారత కర్త యెడ సంస్మరణ రూపమగు భక్తి ప్రకటించియున్నాడు. ఆ స్తుతి వాక్యములో, ఈ కవిపేరు తిరుమలభట్టనియు, ఇంటిపేరు బట్టేపాటివారనియు గలదు :