పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; సప్తమాశ్వాసము

431


ఆపాండుతనయుల కపుడు పాంచాలుఁ
డే పార నైదువేలిభములు [1] మోయఁ
దగినవిత్తంబులు దండితేరులును
బొగడనొప్పిన యశ్వములు నూఱువేలు,
దాసీసహస్రంబు, దంతిశతంబు,
గోసహస్రంబును గొనియాడ లక్ష ,
రత్న [2] పేటీసహస్రంబులు నాల్గు
యత్నపూర్వకముగా నరణమిప్పించి,
పరఁగ దివ్యాంబరాభరణమూల్యముల
గరమొప్ప బంధువర్గముఁ బూజచేసి,
కనకపాత్రములలో గమ్మనిరుచుల
జనములు [3]మెచ్చ భోజనము పెట్టించి
కట్టనిచ్చిన, నంత గమలనాభుండు
దట్టంపుఁ బ్రియముతో ధర్మరాజునకుఁ
గలిమియేర్పడ రత్న కాంచన తురగ
[4]కలితరథంబులు ఘనతతోనిచ్చె.
అత్తఱి విదురుచే నాపాండుసుతుల
వృత్తాంతమంతయు విభుఁడు దానెఱిఁగి,
వెస నాత్మలో భీతి వెలుపలిప్రీతి
పొసఁగ [5] నౌర్వానలంబున నబ్ధివోలి,
పెద్దకొల్వుననంత భీష్ముండు గురుఁడు
నొద్దికఁ గృపుఁడు దుర్యోధనాదులును
హీరభూషణులు బాహ్లిక సోమదత్త
భూరిశ్రవ స్సూతపుత్త్ర సౌబలులు
నున్నచో, విదురు లోకోత్తరుఁబలికె :
"ఎన్న మాకపకీర్తి యాశుండుమాన్చె;

  1. మ్రోవ.
  2. పీఠ
  3. వెట్ట.
  4. కనక
  5. పూర్వాంతంబుల.(మూ )