పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

386

ద్విపద భారతము



హేమకోటికిఁ బడగెత్తు వైశ్యులను
భామకేర్పడఁజూపి, పాంచాలసుతుఁడు
ఆవరవర్ణిని నపర వర్ణులకు
వేవేగఁ జూపి యావిభులకిట్లనియె:
"సకల భూములవారుఁ జనుదెంచినారు;
శుకవాణి మీకు రాఁ [1]జూడద యురక.
ఇవ్విల్లుమోపెట్టి, యేనింట మీనుఁ
దైవ్వనేసినవాఁడు దీనికిమగఁడు.
[2] అంగవింతురుగాక యాకార్యమునకు
శృంగార నిధు." లన్నఁ జెలఁగి పార్థివులు,

మత్స్యయంత్రమేయుటలో రాజపుత్రులు పరాభూతులగుట



మూలగాలికి లేచు మొగిళులుపోలె
నోలి నందఱులేచి యుద్ధండవృత్తి,
నంచిత పదఘట్టనారావమెసగ
మంచలపై నుండి మహిడిగ్గనురికి,
పై పుట్టములువుచ్చి పటులీలదాటి
..................................
..................................
యాభంగివచ్చిన యాకృతివోలె,
మనుజవార్ధిమధింప మంధరాచలము
చనుదెంచెనో విష్ణుసన్నిధికనఁగ,
నిరువంకలను నడుమేక ప్రకార
పరిణతిఁ బుణ్యాతుపలుకునుబోలెఁ,
గదియ నక్కజమైనఁ గదిసి చేదూర్చి,
కదలింపరాకయగ్గలము మల్లాడి,

  1. జూడక
  2. అంగలించు.(మూ)