పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము


జగదేకవిఖ్యాతచరిత యీగంగ;
జగదేకనిర్వాణజనయిత్రి గంగ;
అట్టిజాహ్నవిఁ దీర్ధమాడకమాన;
మెట్టివాఁడునుమాన్ప నెంతటివాఁడు!
ఏరులు వాగులు నెవ్వరిసొమ్ము!
.................................................
సతులుసన్నిధినున్న చండగర్వమున
బ్రతిభాషలాడకు బంటవై నిలుము."
అనినఁ బద్మవనంబు హస్తి వెల్వడిన
యనువున యువతిమధ్యము వాఁడు వెడలి,
వరభూషణప్రభావళులఁ జీఁకట్లు
పొరిపొరిఁజెదర నేర్పునవిల్లుదాల్చి,
మాటలబోదని మణిరథంబెక్కి,
బోటులు వెఱవ నద్భుతపరాక్రముఁడు
అమ్ముల సంధించి, యవని పైఁ బింజ
లిమ్ముల మోపుచు నిట్లనిపలికె :
“ఎట్టుట్టు రా! నన్ను నేమంటి మనుజ!
పొట్టక్రొవ్వున నన్ను బొమ్మంటి తొలఁగి!
రథమోసరించునే రాట్న మే తేరఁ!
బృథివి నరాధమ! ప్రేలెదెన్నైన;
క్రుక్కుదునో నిన్నుఁ గొఱవినీయేట!
దిక్కెవ్వరున్నారు ధృతినన్నుమాన్ప!
ఒగి నింకముందల కొక్కడుగిడినఁ,
దెగనేయువాఁడ నీతీవ్ర బాణమున."
అని వింట [1]గంధర్వుఁ డమ్ముసంధింప,
మనమునబెదరక మఱియునర్జునుఁడు

  1. గర్వాంధు (మూ )