పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; పంచమాశ్వాసము

299


మొత్తమై దంతులమొత్తి మోటాడి,
మత్తిల్లుహయముల మట్టిమల్లాడి,
కన్నెకయ్యంబులు క్రమముతోఁ జేయఁ,
గన్నులఁ [1]గెంపెక్కి కాంపిల్యపతియుఁ
దలఁప వశిష్ఠనందనులపైఁ దొల్లి
చలముననలుగు విశ్వామిత్రువోలెఁ
గులిశధారలమించు క్రొవ్వాఁడితూపు
లలవోకనిగుడింప, నందంద వెఱచి,
దిక్కులు తెలియక ధృతినెత్తిపోయి
యొక్కలాగునఁ దోవలొయ్యననెఱిఁగి
పాఱి, రప్పుడు వెంటఁబడి ద్రుపదుండు
పాఱవాతి మెఱుంగుబాణంబులేసి:
"యేల వచ్చితిరి! మీరేలపాఱెదరు!
చాలునె! మీకుఁబాంచాలునేయుటలు!
వీచినచేతికి వెయ్యేండ్లటంచు
.................................................
యేనోరు పెట్టుక యేయవచ్చితిరి!
.................................................
బాసినవగ లేదు, పగపట్టలేదు,
.................................................
బాలుర మిమ్ముఁ జంపక కాచినాఁడఁ;
దేలిపొం." డనవిని దేవేంద్రసుతుడు

అర్జునుఁడు ద్రుపదుఁ బట్టి తెచ్చుట



రూపించి కురుకుమారులపలాయనము
చాపశిక్షకునకు సంప్రీతిఁ జూపి,

  1. కెంపెట్టి (మూ )