పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

301

ద్విపద భారతము


కురుకుమారులు కండక్రొవ్వున నతని
గురుదక్షిణార్థమై గొనిపోవవచ్చి
తతిగొనిపాఱిరి తమచేతఁగాక;
ఇతఁడునెగ్గులువల్కె; నిఁక నేనుబోదుఁ;
బవమానసూతి తోడ్పడ నాకుఁగలఁడు;
కవలిదే చక్రరక్షకులున్నవారు;
అన్న రావలదు; మీయడుగులఁగొలిచి
యున్నమే." లనిపోయె నుర్వీశుఁగూడ.
ఆవిధంబునఁబోయి యతఁడస్త్రరుచుల
భూవలయంబుగప్పుచుఁ గూడ సుట్టి:
"నిలునిలు పాంచాల, నీకుఁబోరాదు;
తలపడు మిదె పాండుతనయులమేము;
మాకౌరవులనన్నమాటలవరుస
చేగొని పసలావు సేయర." మ్మనుచు
భానుసమానాస్త్రపటలంబు లేయ,
నేనలతోడ నాక్షితిపతి తిరిగి
పలుతూవులేయంగం, బవననందనుఁడు
కలిగెఁగయ్యంబని గద త్రిప్పుకొనుచు
బరవీర ఘన[1]జానుబాహుమధ్యములుఁ,
గరితురగాది కంకాళమధ్యములు
వ్రేసివ్రయ్యలువావ, వీక్షించిద్రుపదుఁ
డోసరింపక వచ్చి యొక్కొక్కకోలఁ
బాండవసేనలఁ బదుల నిర్వదుల
జెండుగొట్టినయట్లు క్షితిఁ గూలనేసి,
యీసునరథముల కిభచయంబులకు
రా సందులేకుండ రణమధ్యసీమఁ

  1. సార (మూ )