పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; పంచమాశ్వాసము

287


ఫల పుష్ప పల్లవ ప్రతతు [1]లయ్యెడల
నలువొప్ప బహుతోరణంబులు గట్టి,
ముంబైన సోపానములనీడ చూచు
డంబులుగల కల్వడంబులుగట్టి,
కడపట నుదయభాస్కరము గావించి,
కొడిగల రత్నపుఁగుచ్చులు గట్టి,
దీపించునమరావతికి బొమ్మవెట్టు
నీవురియనితోప నెల్ల సౌధములఁ
గాంతులుదైవాఱఁ గనకపుత్రికల
వింతవారలుచూచి వెఱుఁగంద నిల్పి,
యోలి సోరణగండ్ల నువిదలుచూడఁ
నీలిమపర్వెనో నెఱి నిట్లనంగఁ
బరిమళబహుళ ధూపంబు లెల్లెడలఁ
బరఁగించి, రత్నదీపము [2] లోలినిలిపి,
మారుబాణములకు మాఱుబాణములఁ
జేరినజనులు వీక్షింపనీ నేడు
అని విస్తరించినయట్లు సౌభాగ్య
మెనయఁ బురస్త్రీలనెల్లఁగైసేసి
యున్నంత, గరిడియు నూరితూర్పునకు
నన్నిసౌభాగ్యాల నాయితమయ్యె.
పిలువఁబంచిన రాజబృందంబువచ్చె;
నెలమిఁగూడిరిలోకు లిలయీనెననఁగ.
విదురుఁ డత్తెఱఁగెల్ల విభునితోఁ జెప్ప,
ముదమంది యారాజు ముత్యాలరథము
నెక్కుచుఁ దనయులనెల్ల రావించి,
తక్కక గురుని నెంతయుఁబిలిపించి,


  1. లంయడల
  2. లలో నిలిపి (మూ )