పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

288

ద్విపద భారతము


“యింతులు పల్లకులెక్కిరం' డనుచుఁ
గుంతీసమేతులై కొలిచి రాఁ బనిచి,
గాంగేయ కృపులాదిగాఁగల దొరల
సంగరసన్నద్ధ సకలసైన్యముల
రాఁబంచి, బహుళతోరణరాజవీథిఁ
బూఁబోఁడులక్షతంబులుచల్లఁ గదిసి,
సంగడి విదురసంజయు లెల్ల తెఱఁగు
నింగితవేదులై యెఱిఁగింపుచుండ,
నడరి కృష్ణునికుక్షి నబ్జజాండములు
వెడలినగరిమతో వెస నూరువెడలి,
సిద్ధాంతనిపుణులు చేపట్టియున్న
శుద్ధలగ్నంబునఁ జొచ్చిరగ్గరిడిఁ ;
జొచ్చి సేనల నొక్కచో నుండఁబనిచి,
[1]యిచ్చమై రాజులకిమ్ములిప్పించి,
గాంధారియును దానుఁ గనకపీఠమున
బంధుకోటులుగొల్వఁ బసమీఱియుండె.
అప్పుడు బుధునితో నలరారుచంద్రు
చొప్పున ద్రోణుండు సుతునితోనిలిచి,
'ధనువునమెఱయుఁగదా గురుండెపుడు'
ననుచు నక్షత్రజ్ఞులాడ విల్దాల్చి,
'రామాస్త్రములుగాన రాజవైరమున
నేమిసేయునొ రాజు [2]లిందఱ! ననుచుఁ
దొనలమోములుదూర్చి తొలఁగించె' ననఁగ
వెనుకమాటున నస్త్రవితతి ధరించి,
వెనుకొని శిష్యులు విలు కోల జోడు
దొన బొమిడిక పూని తోరమై నిలువ,

  1. ఇచ్చలదగురాజుకిమ్ము లిప్పించి
  2. లిద్దఱు (మూ )