పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

264

ద్విపద భారతము


బెరిగితి; మింతలో బృషతుండుచావ,
సరి రాజ్యమౌనని చని ద్రుపదుండు
పాంచాల భూమికిఁ బ్రభువుగాఁ జనుచు
డించి [1]పోలే కూఱడించి నన్నపుడు :
“ద్రోణ, నీవును నేను దోడ్తోడ గలసి
ప్రాణంబు లేకమై బహుకాల మిట్లు
ఎడమడు వొక్కింతయేనియు లేక
యుడివోనికూర్మితో నుంటి మిన్నాళ్లు.
రమణమై [2]నొంటి నే రాజ్యభారంబు
గ్రమమున భరియింపఁ గారణం బేమి!
భాసురంబగు రాజ్యభాగంబు నేను
భూసురాగ్రణి, నీకుఁ బొసఁగ నర్పింతు.
మిత్రునభ్యుదయంబు మిత్రున కొసగఁ
బాత్రంబుగావున, బంధుయుక్తముగ
నవయనేటికి! నమ్ము నా వెంటరమ్ము  :
సవరింతు నిన్ను నే సకలభోగముల.
రసికత నిటనుండి రానొల్లవేని,
పొసఁగినప్పుడె రమ్ము పూజింతునిన్ను".
అని పోయెఁ; బోయిన, నచ్చోట నేను
ధనువు నేర్చెదనని తలఁపులోఁ బుట్టి
యగ్నివేశుండను యమిచంద్రునొద్ద
నాగ్నేయసాయకంబాదిగా నెఱిఁగి,
విలువిద్యలందలి వినిధకృత్యములు,
నొలసిన బహువిధవ్యూహభేదములు,
నమ్మహామునిశిక్ష నాయుధాభ్యాస
మిమ్ముల నెఱిఁగి నే నెలమి దీపించి,

  1. పోవక
  2. నిట (మూ )