పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; చతుర్థాశ్వాసము

263


నరుణాంబుజమ్ముల కప్పులీఁజాఱు
నరుణిమమించిన యనుగుఁదమ్ములును,
గ్రొన్ననలకుఁబోక కొదమతుమ్మెదలు
తన్ను గొల్వఁగనొప్పు తనుసౌరభంబుఁ
గలిగియున్నది; దీనిఁగనిన నాయొడలు
గిలిగింతలెసగెడుఁ గృత్యమేలింక ! '
నని చూచి, మఱి చూచి, యందంద చూచి,
తనకు భరద్వాజుతరవాయి వచ్చి,
మగువఁజెందినచూడ్కి మరలంగఁదివియఁ
దెగువచాలక చిక్కి ధృతియెల్లఁ దూలి,
కడిమిమై మరుచేతికరవాలులీల
బెడఁగుగా జళిపించు పేర్మి దీపింపఁ
[1]గల్హారదళనేత్ర కడకంటిచూడ్కి
యొలసిముట్టినచిత్త ముత్తలంపడఁగ,
నఱిముఱి సూనాస్త్రుఁడనువేటకాఁడు
తెఱవరూపంబను దీమంబుఁ జొనిపి
కలకంఠి లేఁజూడ్కిగములను నురుల
నెలయింపఁ దగిలినయిఱ్ఱియుఁబోలెఁ,
దొలఁగఁజొప్పడక వందురి తొట్రుగొనుచుఁ,
దలకొన్నకలఁకతోఁ దగ నిల్వలేక
మదనాంబు వొలికిన, మహి నది చూచి
తుదకాలఁ బృషతుండు త్రొక్కెఁ; ద్రొక్కుటయు,
ద్రుపదుండు పుట్టె; నాద్రుపదుండు నేను
నుపమింప వయసున నొక్కపెద్దలము.
అంత, నాతఁడు పుత్రు నచ్చోట నునిచి,
శాంతిమైఁ దొంటిపాంచాలభూములకు
రాజుగాఁ బోయిన, రమణ నిర్వురము
నాజన్మసఖులమై యయ్యాశ్రమమునఁ

  1. కలహార (మూ )