పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

262

ద్విపద భారతము


వీర, యే నిది యుద్భవించినతెఱఁగు ;
నారాక కిటు విను నాల్గుమాటలను.
పృషతుండునా నొక్కపృథ్వీశ్వరుండు
ఋషివేషధారియై ఋష్యాశ్రమముల
మెలఁగి, మాతండ్రితో మిత్రభావమునఁ
గలసి వర్తింపుచు, ఘనుఁ డొక్కనాఁడు
మిన్నేటిచేరువ మేనకాకాంత
పొన్నపూవులు గోయఁ బొడగాంచి సొక్కి:
యెవ్వరొకో! చిత్ర మీపువ్వుఁబోఁడి!
నవ్వకనవ్వెడు నవకంపు మొగముఁ,
ద్రచ్చివైచినయట్లు తలచుట్టుఁ దిరిగి
వచ్చినగతిస్తున్న వాలుఁగన్నులును,
గుంభికుంభకశాతకుంభకుంభములఁ
గుంభినిపైఁబోలు కుచకుంభయుగము,
మరుఁడు జయంబంది మహిమఁ బూరించు
కరశంఖగతి నొప్పు కలికికంఠంబుఁ,
బసనిమించుల మించు బంగారువన్నె
పసిమిగల్గినయట్టి బాహుమూలములు,
సులభ[1]నిమ్నగభర్త సుడివోలె మించి
నలికమై యున్నట్టి నాభిరంధ్రంబు,
సలలితగతి నాకసంబునుబోలి
కలదులేదనువాదు గలిగించు నడుము,
మదనునితేరి సమప్రభఁ బొలిచి
[2]పొదలు సైకతమును బోలిన పిఱుఁదుఁ,
గరికరంబుల గెల్చి కదళికాతతులఁ
బొరపొచ్చెములు సేయఁబూను పెన్దొడలు,

  1. నిమ్నానగ
  2. పొదిసైకతము (మూ )