పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

ద్విపద భారతము


కలికిమీనంబులో ! కన్నులో ! యెఱుఁగ;
నలరినపవడమో ! యధరమో ! యెఱుఁగఁ,
గ్రమ మొప్పఁగంబువో ! కంఠ మో ! యెఱుఁగఁ ;
గమలమృణాళమో! కరములో ! యెఱుఁగఁ ;
జక్రవాకంబులో ! చన్నులో ! యెఱుగఁ;
జక్ర మో! పులిన మో ! జఘనమో ! యెఱుఁగ ;
[1]గరిమకూర్మములొ ! మీఁగాళ్లొ ! యెఱుంగ ;
నరుణపంకజములో ! యడుగులో  ! యెఱుఁగ;
నేరూప మెఱుఁగ లే; నిట్టిసౌభాగ్య
మీరూపు నిర్మింప [2]నేరఁడుబ్రహ్మ
ఒక మాఱు కౌఁగిలి యువిదయిచ్చుటయు,
సకలంబువెలగాదు జగతీతలంబు.
ఈచోట నొంటిగా నెవ్వారికెదురు
చూచుచువచ్చెనో శుక వాణి ముగ్ధ !
అమ్ములగతినాటె నతివ [3]చూపులును
[4]నమ్మఁజాలనిరీతి నాశరీరమున.
నడిగిచూచెదఁగాక యబలవృత్తాంత ;
మడుగంగ మఱుమాట లాడకుండెడినొ!
కదిసి చూచెదఁగాక కమలాయతాక్షి;
గదియఁగా నెక్కడ కదలిపోయెడినొ!”
అని యిట్లుదలపోయు నధిపతిఁ జూచి,
వనజాక్షి యారాజువామాంక మెక్కె ;
ఎక్కినఁ, బులకలు నిరువురమేన
నొక్కట నెసగుట యుపమింపనొప్పె
[5]గీష్పతి పదమగల్గినచోటెఱింగి
పుష్పాస్త్రునకు నారు పోసినాఁడనఁగ.

  1. గరిమకూర్మమొ మొగిళ్లొయెరుంగ.
  2. నేరము.
  3. చూపరులు.
  4. నమ్మరాదన రేని
  5. గ్రీష్పతి. (మూ)