పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

ద్విపద భారతము


పరసతిఁ గామించు పాపాత్ము డిట్లు
ధరఁ గూలు ననిచెప్పి తగఁ జూపినట్లు,
అనుజన్ముఁ డిట్లు పాదాక్రాంతుఁ డైన
గనికరం బెంతయుఁ గల్గి యద్దేవి
కనుదమ్ములను నీరు గ్రమ్మంగఁ గాంచి
తనలోనఁ దలపో సెఁ దత్తఱిల్లుచును
"ఇపు డేమి సేయుదు , నితఁ డిట్లు మరుని
విపులమాయకు లోఁగి వికలాత్ముఁ డయ్యె !
పరకాంత వలచునప్పాపాత్ము డెపుడు
వరధర్మపథ మేల భావించు నెదను.
పరమసాధ్వియుఁ బతివ్రతయు నౌదీని
నరుదారఁ గామించె; అజ్జసంభవుని
శాసనం బెటు దాఁటఁ జాలు నెవ్వరికి ?
ఈసతి వలచి తా నెం తెంత యిడుమ
లందంగ వలయునో యకట యీతనికి !
అం దందఁ బ్రకటశార్యాటోపమునను
అరివారమును బట్టి యలవోక విఱిచి
వరకీర్తిఁ గాంచిన బలసమన్వితుఁడు
సుమబాణనికరంబు సోఁకఁ దూలెడిని!
తముఁ దా రెఱుంగరు తమికొన్న వారు.