పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -1


అప్పుడు నృపకాంత యౌసుదేష్ణయును
వి ప్పైన మేడలో వేడ్కతో నుండి
సరసరీతులఁ జూచి సఖుల కిట్లనియె:
“వరరూపయానసౌభాగ్యంబు దనర
నిదే యొకతరలాక్షి యీసమీపమున
మదనుపట్టపురాణిమాడ్కిఁ బోయెడిని.
పౌరులు తను వేడ్క పడి చూచు చుండ
ధీరత్వ మెడలదు; తెఱవ యొంటిఁ జను ;
తనుఁ జూచి యెక్కడిదాన వీ వనిన
మనుజులఁ దల వంచి మాట లాడెడిని.
నీచత్వమున నేల నెగడునో కాని
రాచదేవేరి యౌ రమణి నియ్యింతి.
చూతము తోడ్తెండు సుదతి నిచ్చటికి ,
ప్రీతి పుట్టెడి దీనిఁ బ్రేమ మన్నింప "
అనవుడుఁ జెలు లేగి యర్థిఁ దోడ్తేర
వనజాక్షి సౌధంబు పై నెక్కునపుడు
పటికంపునెలకట్ల పైఁ బాదరుచులు
చటులకుంకుమ మొలిఁ జల్లినట్లుండె.
మేడపై కీభంగి మెలఁత యే తేర
వేడుకతో నంత విరటుభామినియు