పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

ద్విపద భారతము


నరుదారఁ గడుమైల యగుచీరఁ గట్టి,
పరుషవల్కలములు పైఁటగాఁ దాల్చి,
కప్పారి పల్చన గాఁ జిన్ని మొయిలు
గప్పినశీతాంశుకళయును బోలెఁ,
బూని పారావార మున మించునీట
నాని సొం పఱి యున్న నలినియుఁ బోలెఁ,
వింతలాగున ధూమవితతి క్రిక్కిఱియఁ
గాంతి మాసినదీపకళియుఁ బోలె,
ధూళి పెల్లునఁ జిక్కి తొంగలింపకయ
లీల నొ ప్పఱి యున్న లేఁదీగెఁ బోలె,
పరిచారికావృత్తిఁ బాంచాలి యెసఁగి
పురవీధి నేతేరఁ, బురకాంత లపుడు,
“ఇది రోహిణియొ కాక యిది యరుంధతియొ?
వెదకిన మహి నిట్టి వెలఁదు లున్నా రె ?
కనుదోయి కేల్గవ కమనీయముఖము
తనువల్లి కురులు పాదంబు లొప్పారె,
హరుమేను నజుమోము హరియురస్థ్సలము
ఇర వైనఁ దగుఁ గాక యీతలోదరికి" !
అనుచు గుంపులు గట్టి యం దందఁ జూడ
వనజాక్షి తూలుచు వడి నేగుదేరె.