పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

338

ద్విపదభారతము

అనిన నుత్తరునకు నామాట లెల్ల
మనసులో సొగయక మత్స్యేశుఁ జూచి

ఉత్తరుఁ డర్జునునకు నుత్తర నిచ్చి పెండ్లి గావింపఁ గోరుట.


"రణములలో వీరు రక్షింప కున్న
గణుతింప నింక నెక్కడిది రాజ్యంబు !
ఈరీతి నీ వొకఁ డిచ్చువాఁడవును
గోరి వా రొగిఁ బుచ్చికొనెడివారలు నె ?
కానమి మన మింతకాలంబు వారిఁ
బూని కొల్వనితప్పు బుద్ధి జింతింపు.
దీనికై మనము ప్రార్థించుట గాఁగ
మీనాక్షి నిత్తము మీతనూభవను;
మణులు రాజ్యంబును మనకుఁ బో బ్రాఁతి
తృణముగా నవి వారు దృష్టింతు" రనిన
మనసునఁ బ్రియ మంట మంత్రిపుంగవులఁ
గనుఁగొని వారి నాక్షణమె భూనాథుఁ
డుత్తరఁ గైసేసి యెనరఁ దెచ్చుటకుఁ
బుత్తెంచుటయు వారు పొంగుచు వచ్చి
పొలుపారఁ గేకయపుత్త్రితోఁ జెప్పఁ
జెలువ శృంగారింపఁ జెలులఁ బుచ్చుటయుఁ