పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము----ఆ -5

317

యది యెల్లఁ దనదుపయ్యదకొంగునందు
మృదువుగాఁ దుడిచి యమ్మెలఁత వెండియును
బసిఁడి బిందియ యందు భాసిల్లునీటఁ
బస మీఱఁ దనపాణిపద్మంబు దడిపి
తుడుచుచో "నీ వేల తుడిచెద? " వనిన
పుడమి ఱేనికిని నాపూఁబోణి యనియె
“ఇతఁ డుత్తమాచార్యుఁ డితఁ డసదృశుఁడు;
ఇతని నెత్తురు ధాత్రి నెన్ని బిందువులు
రా లెడి నన్ని వర్షములు నీభూమిఁ
జాల దుర్భిక్ష దోషము గల్గుఁ గాన
విను నీకు హితము గావించితి" ననుచు
నొనరంగఁ దుడుచుచు నుండె నమ్ముదిత.

అర్జునుఁడు నుత్తరుఁడును బురముఁ బ్రవేశించుట.


అంత నక్కడఁ బౌరు లాయుత్తరునకు
నెంతయు వేడ్కతో నెదురుగాఁ బోయి
శుభతూర్యములు కర్ణసుఖముగా మ్రోయ
శుభవాక్యములతోడ సొం పగ్గలించి
నరనాథసుతుమీఁద నరుమీఁద నపుడు
సరసాక్షతలు నిండఁ జలి దీవించి