పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

318

ద్విపదభారతము.

రావేళఁ జూపఱు లలమారుగజమొ
భావింప భావజుపటుశస్త్ర మొక్కొ
యసమ యౌమరుని మోహనవిద్యయొక్కొ
కుసుమాస్త్రు సతిచిల్క కొదమ యౌనొక్కొ
యని యాత్మ నబ్బురం బంది చూడఁగను
ఒనర బంగరుబొమ్మ యొప్పు గై కొనుచు
వేవురుకన్యలు వెన్నాడి కొలువఁ
దా వచ్చి నగుచు నుత్తర యన్న మీఁద
విజయుమీఁదను గూర్మి వెలయంగ నంత
నిజకటాక్ష ప్రభ ల్నింగి నిండఁగను
మృగనాభితోఁ గూడి మే లై నవిరులు
నగరు మిశ్రము లైసయాణిముత్తెములు
గరపల్లవంబులఁ గర మర్ధిఁ బట్టి
మురు వైనగాజుల మొరపంబు లలరఁ
జల్లి మ్రొక్కిన నంత సకల బాంధవులు
నుల్లంబు లింపార నుత్తరుఁ జూచి
"సాహసభుజసార జయరమాధార
బాహుదర్పోల్లాస వరకీర్తివాస
కురువీరులను దాఁకి కొమ రొప్ప జయము
నరుదార నిం కొరుఁ డందంగఁ గలఁ డె!