పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము-ఆ

289

అడరి కౌరవసేన లంత నార్పులును
బెడబొబ్బలును మీఱ భీష్ము నగ్గించి
“గెలిచితి ! గాంగేయ గెలువు మర్జునుని.
తలపంగ మాపాలిదైవంబ వీవ ;
నీవు విల్లందిన నృప్పుఁడు మిన్నందె.
ఆవల నీచిత్త" మనిన భీష్ముండు
పడగపై నెనిమిది బాణంబు లేసి
పడగ నుండెడిభూతపంక్తి నొప్పించి
పరఁగ నుత్తరుమీఁదఁ బదితూపు లేసి
పరఁగ రథ్యములపై బదితూపు లేసి
యర్జునుపైఁ దూఫు లరిబోయు నంత
నర్జునుఁ డవి ద్రుంచె నస్త్రవర్షముల.
త్రుంచి వెండియు మచు దొఱఁగువేగమున
నంచితకాండంబు లవనిపైఁ బఱప
నవియును భీష్మ బాహాతీవ్రగతుల
రవిచేత నంధకారమువోలె నడఁగె.
వెండియు నరుఁ డేయ వెస భీష్ముఁ డేయ
మండుచు బాణాగ్ని మహిత మై పర్వ
నెరయ వార్థులలోనినీ రెల్లఁ గ్రాఁగి
యరయ వేల్పులకొండ యంతగాఁ గాచి