పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

288

ద్విపదభారతము.

గొండంత వేడ్కఁ గైకొని చూచు చుండ
నొండొరు ల్దలపడి రొగి భీష్మనరులు ;
నుతవాయువేగమనో వేగములను
అతిభారగతిఁ దేరు లపుడు వర్తించె.
తొడిగి వా రేసినతూపు లన్నియును
నడుమఁ దార్కొని పోరి నగ్గుగాఁ దూలు.
పొనర నాగ్నేయాస్త్రమునకు వారుణము
మునుమిడి నైంద్రాస్త్రమునకు రాక్షసముఁ
బొనరంగ నంతకమునకు సౌరమును
మునుకొన్న యురగాస్త్రమునకు గారుడముఁ
బొలు పైనదైత్యాస్త్రమునకు వైష్ణవము
నలి మేఘబాణంబునకు వాయుశరము
మొద లైనప్రతిబాణములు సంతరించి
కదిసి యొక్కరుని కొక్కరు డీలు పడక
చల మొప్ప దొనలపైఁ జాఁచినచేయి
సొలవక శరముఁ దెచ్చుచు నున్న చేయి
క్రచ్చఱ వేగంబుఁ గైకొన్న చేయి
క్రుచ్చి యమ్ముల నారిఁ గోరాడుచేయి
గలిగి నిశ్చలబాహుఘనచతుర్భుజునిఁ
దలపించు చుండి రిద్దఱుఁ బెద్దప్రొద్దు.