పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

ద్విపద భారతము


ఎచ్చోటనుండి నీ వేతెంచి తనినఁ
గ్రచ్చరఁ బాంచాలి కడనుండి యందు."
అనవుడు శంకించి యమతనూభవుఁడు
వనితఁ దప్పక చూచి వల నొప్పఁ బలికెః
"వనజాక్షి నీ విట్లు వర్తించునపుడు
జననాథునగర దుర్జను లుండి రేని
విపుల భారతవంశ విభులకు మాకు
నపకీర్తి రాకుండ నడఁకువ నుండు.
నీకంటె నెఱిఁగెడినెలఁత లున్నారె ?
చేకొని యెకమాటఁ జెప్పి చూపితిని."
అనుటయు నమ్మాట లాలించి యతివ
వినుతహాసము దోఁప విభున కిట్లనియెః
వర్తింతు నెట్లైన వసుధేశ యేను
"వర్తించుపనికి నై వగవంగ నేల?"
అనిన సంతోషించి యా ధర్మరాజు
మునుకొన్న వేడ్కఁ ద మ్ముల నెల్లఁ జూచి,
"ఇట్లున్న మనలను నింక శాత్రవులు
ఎట్లు కాంచెదరు తా రియ్యేటిలోన?
వేయుమాటలు నేల, వేడ్క నిందఱముఁ
బోయి కొల్తము మత్స్య భూమిపాలకుని.