పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -1


అమరంగ మన వైనయగ్ని హోత్రములు
రమణమై ధౌమ్యులు రక్షింపఁ గలరు.
ఈరథంబులు గొంచు నెలమి సారధులు
ద్వారకానగరి కిం దఱు బోవువారు
పరగ ద్రౌపదియొద్దిపరిచారికలును
దొరసి వండెడువారు ద్రుపదుఁ జేరుదురు.”
అని బుద్ధిగాఁ జెప్పి యఖిల సేవకుల
ననిచి భూతలనాథుఁ డనుజులుఁ దాను
నొప్పుగా నరుగుచో నొనర ధౌమ్యుండు
చేస్పి ని ట్లని రాజు సేవించు తెఱఁగు :

ధౌమ్యుఁడు పాండవులకు సేవాధర్మంబు లెఱింగించుట.

"పాండునందనులార, బలియు రౌమీరు
ఒండొక్క విభుఁ గొల్చి యుండు టచ్చెరువు!
మద మేఁది మానాపమానంబులకును
మది నోర్చి కాని నెమ్మదిఁ గొల్వ రాదు,
ఓర్వక యొక రొక రుగ్రింతు రేని
గీర్వాణపతి నైన గెల్వఁ జాలుదురు.
కావున మీకు నేఁ గడఁగి భూపతుల
సేవించుగతిఁ గొంత చెప్పెద వినుఁడు.