పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

240

ద్విపదభారతము.

బర్జన్యునోజ దోర్బలసాంద్రుఁ డగుచు
నర్జునుం; డిదె చూడుఁ డస్త్రయుగ్మముల
నా పాదములమోల నయ మొప్ప నేసి
యేఫునఁ బూజించె; నింతయే కాక
సోఁకి సోఁకములుగా శ్రుతిపుటంబులకు
సోఁకునట్లుగ నాదుసుఖ మెల్ల నడుగు
పగిది బాణము లేసె బహునీతివిదుఁడు!
పగవారి సేఁతలఁ బ్రాభవం బెడలి
యిడుమలఁ బడి నొచ్చి యింత కాలంబు
నడవి నుండినశోక మంతయుం బుచ్చి
సమయంబు వెస నిశాసమయంబుభంగి
నమరంగ నెరపి మార్తాండుఁ డై కది సె॥
నని గురుం డాడంగ నాభీష్మకృపులు
మనసున నరుఁ డేయుమార్గణంబులను
దమకు మ్రొక్కుట గాఁగఁ దమ సేమ మరయు
క్రముముగా నెఱిఁగి తా మలరంగఁ గ్రీడి
తక్కినవారికి దర్శింప రాక
స్రుక్కక పసు లేగుచోటుకై పోవ
నాతనిఁ జూచి దివ్యాపగాసుతుఁడు
నాతతకురుసేన కర్థి ని ట్లనియెః