పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము---ఆ-౪.

239

సరస కేతెంచి యాసర్ప కేతనునిఁ
బరికించి యందులోపలఁ గానరాక
నరుఁ డట్టిసేనకు నడుమ ముందఱను
వరుసతో దక్షిణవామభాగముల
వెనుక దిక్కున నున్న వీరవర్గముల
నొనరంగ భూమింజయున కేర్పరించి
"తొలఁగె నిచ్చట లేఁడు దుర్యోధనుండు;
తలఁగి పసులవెంటఁ దాఁ బోవ నోపు.
లీల యొప్పఁగ రాజు లేనికయ్యంబు
నేల సేయఁగ మన కీసేనతోడ:
పొద పొద మన తేరుఁ బోవ ని” మ్మనుచుఁ
బదిలంబుగాఁ జెప్పి బలభేదిసుతుఁడు
కృతభక్తి ద్రోణాగాంగేయులకృపుల
శ్రుతి పాదయుగళంబు సోఁక రెండేసి
బాణంబు లేసినఁ బరిజనంబులకు
ద్రోణుఁ డర్జునుఁ జూపి తొడరి యి ట్లనియె:
"ఒనరుగాండీవము విద్యుల్లిలఁ గ్రాల
వనచరధ్వజురావపటుగర్జ లొలయ
జలదాకృతిం దాల్చి జవ మొప్ప వచ్చు
నలరథంబునఁ జూడుఁ డలరారు నదిగొఁ