పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

224

ద్విపదభారతము.


నొడ బడి రిట్టు లయ్యెడ బాటుం జక్క
గడపకము న్నేల కాన్సించు నరుండు?
ఇప్పు డేమిటం దప్పె నెల్ల పాండవులు
నెప్పట్టియట్ల పోయెదరు కానలకు,

ఈ తెఱం గంతను నిటవచ్చునపుడు
మో తోడం జెప్పితి; మీ "రేల వదర?
ఎక్కువతక్కున నీకాలమునకు

నిక్కంబు భీష్ములు నిర్ణయించెదరు.
వెస రెండు తెఱగు లై విరట భూపాలు
పనుల బట్టుట యెొబ్లం బాడునందనులం
జూడ నింతియు కాదె? చూచితి మితని.
వేడుకల గయ్యంబు విజయుతోం గల్లెం
బరికింప మే లయ్యె! పసులం బట్టితిమి.
నరుం డైన హరుడైన నా కేల వెఱవ ?
రా నిమ్తు నచ్చిన రణము నేయుదము,
సేనలతోడ డాసినయట్టీ మనము
సరగ జయింతుము సంచలింపకుండు.
అరుజెంచె రథయోధుం జాయ త్రపడుడు...
వరికింపం బగవాడు పాంతఱం బడిన
కరణి నక్జునుం డొంటిగా వచ్చె నేండు!