పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-4



శ్రీసమంచితనేత్ర చిరకృపాపాత్ర
వాసవాకార దేవయముమ్మధీర
వినుము వెండియు నిట్లు వినరింపఁ దొడఁగె
జనమేజయునకు వైశంపాయనుండు:
అంతఁ గౌరవనాధుఁ డరుణోదయమున
నంతయుఁ దెలిసి సైన్యంబు రాఁ బనిచి
పాతాళభూతల బ్రహ్మలోకములు
భీతిల్లఁ బ్రస్థానభేరి వేయించి
కదలే ద్రోణాచార్యగాంగేయకృపులు
మొదలైనరథికులు మొత్త మై నడువ.
అప్పుడు సేనపై నా డె గృధ్రములు
నిప్పులు వర్తించె నిండు మేఘములు
వసుమతి గంపించె వఱళులు గూసె
నెసఁగి ఱువ్వుచు వీచె నెదురుగా గాలి.