పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

170

ద్విపద భారతము.



భుజములు మూడుగాఁ బొంగి యుప్పొంగి
నిజసారధినిఁ జూచి నెఱి నిట్టు లనియె:
"సారధి నీ నేర్పు సకలంబు నిపుడు
పోరిలో దూకుఁ జూపుదు కాక నీవు,
ముందట నదె కంటె మొన గాన వచ్చె
నందులో నదె త్రిగర్తాధీశుపడగ,
ఆదిక్కునకుఁ బోవ నరదంబుఁ బఱపు
భేదించి చొచ్చి నిర్భేదింతుఁ గాని,"
అనుటయు వాడును హరులపగ్గములు
గనుకని విడువ నగ్గలికతో రథము
నొప్పారఁ బఱచి యత్యుగ్ర వేగమునఁ
నప్పుడె చనఁ ద్రిగర్తాధీశుమీఁద
విరటుండు నిజ బాహువీర్యంబు మెఱయ
నరదంబు లేనూఱు హతముగాఁ బొడిచి
తెప్పలై ధరఁ గూలఁ దెగ వ్రేయుటయును
"కుప్పించి యరులపై ఘోరంబుగాను
రాజు దాఁ బోరెడు రండు రం" డనుచు
నాజికీ సన్నద్ధ మైమత్స్యబలము
క్రోడదిగ్గజనాగకూర్మంబు లదరఁ
గూడి సైన్యంబుల ఘోషంబుతోడ