పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-3

169

భాసురకీర్తిమై బవరంబు సేయు
నాసమయంబున నల్లిబిల్లి కొనెఁ
బృథివియు మిన్నని భేదింప రాక
పృథురోచు లంతట బెరయ నించుచును
పరశుతో మరశూలపట్టసంబులును.
శరముల పఱపున శత్రు సైన్యములు
వెఱచియు మఱచియు వెసఁ గావుఁ డనుచు
నఱచియుఁ బఱచియు నటఁ గూడఁబడక
యెదు రైనరథికుల నెదు రైనకరుల
నెదు రైన యోధుల నిలఁ గూల్చు చుండె.
శంఖుండు నడరి నిశ్శంక మార్గమున
శంఖంబు పూరించి సంకులం బెసఁగ
జడధిలో మందర శైలంబు వోలెఁ
గడిమిమై రిపుసేనఁ గలఁచి యాడుచును
అలుగులు వఱదగా నాహవక్షోణి
గలయఁ గప్పిన దేవగణ మెల్ల నార్చె,
ఆడె నారద మౌని యప్సరోంగనలు
నాడిరి , పాడిరి యతి మోదమునను.
ఈరీతిఁ దమ్ములు హితులు నందనులుఁ
బోరాడఁ గని మత్స్యభూమీశ్వరుండు