పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము-ఆ-3.

155

 
అవనీశ నీవు మ మ్మడిగితి కాన
వివరింతుఁ గార్యంబుఁ వెసఁ దోచినంత.
తెలియుము వా రుండు దేశంబునందుఁ
దలపోయఁ దఱుఁగనిధాన్యంబు గలుగు,
కాలవర్షంబులు గలిగి ధారుణిని
జాల సుభిక్ష మై జనము వర్ధిల్లు,
గురుమంత్రపితృ దేవగో(బాహణులకుఁ
జిరకాలమును భక్తి సేయు చుండుదురు.
అది గాక గోవు లియ్యాకాల మనక
పిదుకు నూరక యైనఁ బెరుగు నర్థములు.
అట్టిదేశంబు లెయ్యవి మీరు వారి
నట్టిచో వెదకింపుఁ డపుడు తోఁచెదరు"
అనినఁ గృపాచార్యుఁ డన డూహ చేసి
మనుజేంద్ర మీ రేల మసలు చున్నారు ?
వనమున బండ్రెండువత్సరంబులును
జన గోప్యముగ నొక్క సంవత్సరమును
నియతితో నిండించి నేఁ డెల్లి వారు
రయ మొప్పఁ గోపించి రా నున్న వారు.
ఈలోపలనె వారి వీక్షించు తెఱఁగు
వాలాయమునఁ జేయ వలయు నెంతయును.