పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

ద్విపదభారతము.

అది గాక మనబలం బాయత్తపఱిచి
పదిల మై యుండుట భావ్యంబు చూడ.
సైన్యంబు రప్పింపు సఖుల రప్పింపు
మాన్యుల రప్పింపు మనుజేంద్ర నీవు.
పడి వారు సమయంబు బాసమై నెరపి
కడఁగి కయ్యమునకుఁ గాలు ద్రవ్వుచును
రా నేమి చేసెను రహి యుద్ధమునకుఁ
బూనంగ వలె శాంతి పొసఁగ కుండినను.
పాండవు లన నేల, పగవారు మఱియు
నొం డొక రైన నుద్యోగంబు వలదె?”
అని యిట్లు తమబుద్ధు లర్ధి నిద్దఱును
వినిపించుటయును భూవిభుఁడు చింతించి
కార్యంబు తుదఁ గాంచి కర్ణాథిరథిక
వర్యుల వీక్షించి నల నొప్పఁ బలికె:

పాండవులు మత్స్యదేశంబున నున్నా రని దుర్యోధనుఁడు నిర్ణయించుట.



"బలుఁడు భీముఁడు సింహబలుఁడు శల్యుండు
నిలలోన సమబలు లిట్టిసాహసులు
వీరిలోపల వీరె వీరిచావులకుఁ
గారణంబులు గాని కా రన్యజనులు.