పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-2

121

పిడుఁగు నైనను జెండ బెళుక వెన్నఁడును,
తడవక తగునయ్య ధైర్యంబు విడువ ?
పొదపొద ప్రొద్దయ్యె భోజనంబునకుఁ
బదివేవు రున్నారు పంక్తిఁ గూర్చుండ”
ననినఁ గీచకుఁడును నమ్మాట లెల్ల
వినక చేష్టలు దక్కి వెఱ్ఱి యై యున్న
నా సేవకులు వాని నచట భోజనము
చేసినవానిఁ గాఁ జేసి పోవుటయు
వెలుపలి కేతెంచి వెసఁ గీచకుండు
తలకొన్న చలిగాలి, దల కంటగింప
లేఁదీఁగజొంపంబు లీలతోఁ జేరి
పూఁ దేనెజడికిఁ బుప్పొడికి భీతిల్లి
"గ్రహదోష మనుమాట గలిగెనో కాక
కుహకి సూర్యుఁడు గ్రుంక కున్నాఁడు వేగ.
పరశురాముఁడు వేఁడఁ బశ్చిమాంభోధి
పొరిఁ బొరి దూర మై పోయెనో కాక !
మెఱవడిఁ జనుదెంచి మేరుపర్వతము
చఱిఁ బడి రవితేరు సొగ కున్న దియొ !
బిల్లఁ జిమ్మినమాడ్కిఁ బెకలించి సూర్యుఁ
బలంబుచోటికిఁ బాఱఁ జిమ్ముదును."