పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

ద్విపద భారతము.

అని యిట్లు తమకించి యాసింహబలుఁడు
వనజలోచనరాక వడిఁ గోరు చున్న
"నీనీచుఁ జంపింతు నే నింకఁ గ్రుంకి
వీనిఁ జూచుట కాదు వెస" నన్నయట్లు
విపుల తేజం బెల్ల వేగంబ విడిచి
యపరాబ్ధిలోఁ గ్రుంకె నర్కు బింబంబు.
పడమటిది క్కునఁ బరఁగుభామినికి
నడరి కుంకుమగంద మలఁదినమాడ్కి,
ననురాగ మెసఁగ సంధ్యాకాల మయ్యె.
ఘన మైననక్షత్రగణ మంతఁ దోఁచె;
కలువలు వికసించె; కలఁగె జక్కవలు;
వలరాజు విల్లెత్తె; వసుధ నెల్లెడల
సనయంబు సొం పెక్కె; నాడె భూతములు.
మొనసి పయ్యర వెట్టె, మోడ్చెఁ బద్మములు,
అంత బాలేందుఁడు నస్తమించుటయు
వింతగాఁ జీ కట్లు విరిసె నెల్లెడల,
కన్ను విచ్చిన మూయఁ గలయఁ జూడ్కులకు
నున్నతి జనులకు నొక్కరూ పయ్యె.
అప్పుడు పాంచాలి యనిలసంభవుని
నొప్పుగా డగ్గరి "యొరు లెఱుంగకయ