పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దుశ్చేష్టకు శిక్ష.

426. దుశ్చేష్ట చేయు వారెవరైనసు మూడు మాసముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానా తో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఏబది రూపాయల మొత్తము మేరకు చెరుపు కలిగించు దుశ్చేష్ట,

427. దుశ్చేష్ట చేసి తద్వారా ఏబది రూపాయల వరకు లేక అంతకు మించిన మొత్తము వరకు నష్టము, లేక చెరుపు కలుగజేయు వారెవరై నను. రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని జుర్మానాతోగాని ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

పది రూపాయల విలువగల జంతువును చంపుట లేక వికలాంగ పరచుట ద్వారా చేసిన దుశ్చేష్ట.

428. పది రూపాయల లేదా అంతకు మించిన విలువగల ఏదేని జంతువునుగాని జంతువులనుగాని చంపుట, వాటికి విషము పెట్టుట, వాటిని వికలాంగపరచుట, లేక నిరుపయోగమై నవాటిగ చేయుట ద్వారా దుశ్చేష్టను చేయువారెవరై నను రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జూర్మానాలోగాని,ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

ఎంత విలువ గలవైనను పశువులు మొదలగు వాటిని లేక ఏబది రూపాయల విలువగల ఏదేని జంతువును చంపుట ద్వారా చేసిన దుశ్చేష్ట.

429. ఎంత విలువగలదై నను--ఏదేని ఏనుగును, ఒంటెను, గుర్రమును, కంచరగాడిదను, గేదెను, ఆంబొతును, ఆవును లేక ఎద్దును గాని, ఏబది రూపాయల లేదా అంతకు మించిన విలువగల ఏదేని ఇతర జంతువునుగాని, చంపుట, విషము పెట్టుట, వికలాంగ పరచుట, లేక నిరుపయోగమై నదిగా చేయుట ద్వారా దుశ్చేష్టను చేయువా రెవరైనను, ఐదు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, రెండింటితో గాని శిక్షింపబడుదురు.

నీటిపారుదల నిర్మాణములకు హాని కలిగించుట ద్వారా గాని, వీటిని ఆక్రమముగా మల్లించుట ద్వారా గాని చేసిన దుశ్చేష్ట.


430. వ్యవసాయ ప్రయోజనముల కొరకు, లేక మనుష్యులకుగాని, ఆస్తిగా ఎంచబడు జంతువులకుగాని ఆహారము లేదా పానీయముకొరకు, లేక పారిశుధ్యము కొరకు, లేక ఏదేని వినిర్మాణము కొనసాగించుట కొరకు అవసరమగు నీటి సరఫరాను తగ్గింపజేయునట్టి, లేక తగ్గింపగలదని తాను ఎరిగియున్నట్టి, ఏదేని కార్యమును చేయుటద్వారా దుశ్చేష్ట చేయునతడెవరైనను ఐదు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని జుర్మానాతోగాని ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

పబ్లికు రోడ్డు, వంతెన,నది, లేక కాలువకు హాని కలిగించుట ద్వారా వేసిన దుశ్చేష్త,

431. ఏదేని పబ్లికు రోడ్డును, వంతెనను, నౌకాయానానుకూలమైన నదిని, లేక సహజమైనదైనను కృత్రిమమై నదైనను, నౌకాయానానుకూలమైన జలమార్గమును, ప్రయాణమునకుగాని, ఆస్తి రవాణాకుగాని పనికి రానిదిగనో, తక్కువ సురక్షితమై నదిగనో చేయునట్టిదైనను, చేయగలదని తాను ఎరిగియున్నట్టి దైనను ఏదేని కార్యమును చేయుట ద్వారా దుశ్చేష్ట చేయునతడెవరైనను, ఐదు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని జుర్మానా తోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

పబ్లికు మురుగుకాల్వకు చెరుపు కలుగునట్లుగా దానిని జలమయము చేయుట ద్వారా గాని, ఆది పారకుండా ఆటంకపరచుట ద్వారాగాని చేసిన దుశ్చేష్ట.

432, పబ్లికు మురుగు కాలువకు హాని లేక చెరుపు కలుగునట్లు దానిని జలమయము చేయునట్టి లేక అది పారకుండా ఆటంకపరచునట్టి లేక తద్వారా అది జలమయమగునని లేదా దానికి ఆటంకము కలుగగలదని తాను ఎరిగి యున్నట్టి ఏదేని కార్యమును చేయుట ద్వారా దుశ్చేష్ట చేయునతడెవరైనను, ఐదు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాలోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

దీపస్తంభమును, లేక సముద్ర చిహ్నమును నాశనము చేయుట, కదిలించుట, లేక తక్కువ ఉపయోగకరమైనదిగా చేయుట ద్వారా చేసిన దుశ్చేష్ట.

433. ఏదేని దీప స్తంభమును గాని, సముద్ర చిహ్నముగ ఉపయోగింపబడు ఇతర దీపమునుగాని, నావికుల కొరకు మార్గదర్శకముగ ఉంచబడిన ఏదేని సముద్ర చిహ్నము, లేదా బోయ్ లేదా ఇతర వస్తువునుగాని నాశనము చేయుటద్వారా లేక కదలించుట ద్వారా, లేక పైన చెప్పబడినట్టి దీపస్తంభము, సముద్ర చిహ్నము, బోయ్, లేదా ఇతర వస్తువును నావికులకు మార్గదర్శకముగ తక్కువ ఉపయోగకరమగునట్లు చేయునట్టి ఏదేని కార్యమును చేయుట ద్వారా దుశ్చేష్ట చేయువా రెవరైనను ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెండింటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానా తో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు,

పబ్లికు ప్రాధికారిచే ఏర్పరచబడిన భూమి హద్దు గుర్తును నాశనము చేయుట, కదలించుట మొదలగునవి చేయుట ద్వారా చేసిన దుశ్చేష్ట.


434. పబ్లికు సేవకుని ప్రాధికారమునుబట్టి ఏర్పరచబడి, భూమి హద్దులు ఏర్పరచు ఏదేని గుర్తును నాశనము చేయుట లేక కదలించుట ద్వారా గాని, అట్టి భూమి హద్దుల నేర్పరచు చిహ్నమును అట్టి చిహ్నముగ తక్కువ ఉపయోగకరమగునట్లు చేయు ఏదేని కార్యమును చేయుటద్వారాగాని, దుశ్చేష్ట చేయువారెవరై నను ఒక సంవత్సరము దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటిలోగాని శిక్షింపబడుదురు.