పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వందరూపాయల మొత్తము మేరకు, లేక వ్యవసాయ విషయమున పది రూపాయల మొత్తము మేరకు చెరువు కలిగించు ఉద్దేశముతో నిప్పు లేక ప్రేలుడు పదార్థము ద్వారా చేసిన దుశ్చేష్ట.

435. ఏ ఆస్తి కై నను వంద రూపాయిల లేక అంతకుమించిన మొత్తము మేరకు, లేక (ఆ ఆస్తి వ్యవసాయ ఫలసాయమై నయెడల) పది రూపాయల లేక అంతకు మించిన మొత్తము మేరకు చెరుపు కలుగజేయవలెనను ఉద్దేశముతో గాని, తద్వారా తాను అట్టి చెరుపును కలిగించగలనని తెలిసియుండిగాని, నిప్పు ద్వారానై నను, ఏదేని ప్రేలుడు పదార్థము, ద్వారా నైనను దుశ్చేష్ట చేయునతడెవరైనను, ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడును మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును.

ఇల్లు మొదలగు వాటిని నాశనము చేయు ఉద్దేశముతో నిప్పు లేక ప్రేలుడు పదార్థము ద్వారా చేసిన దుశ్చేష్ట

436. సాధారణముగ ఆరాధన స్థలముగగాని, మనుష్య నివాసముగగాని, ఆస్తి అభిరక్షణ స్థలముగగాని ఉపయోగింపబడునట్టి ఏదేని భవనమును నిప్పు లేక ఏదేని ప్రేలుడు పదార్థముద్వారా నాశనము చేయు ఉద్దేశముతో గాని, తద్వారా తాను నాశనము చేయగలనని ఎరిగియుండిగాని, దుశ్చేష్ట చేయునతడెవరైనను యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింపబడును మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును.

డెక్క వున్న జలయానమును లేక ఇరువది టన్నుల భారపు జలయానమును నాశనము చేయు లేక భద్రత లేనిదిగా చేయు ఉద్దేశముతో చేసిన దుశ్చేష్ట.

437. డెక్కువున్న జలయానమును, లేక ఇరువది టన్నుల లేక అంతకుమించిన భారపు ఏదేని జలయానమును నాశనము చేయు, లేక భద్రత లేనిదిగచేయు ఉద్దేశముతోగాని, తద్వారా నాశనము కాగలదని, లేక భద్రతలేనిది కాగలదని ఎరిగియుండి గాని ఆ జలయానము విషయమున దుశ్చేష్ట చేయు వారెవరైనను, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

437వ పరిచ్ఛేదములో వివరించబడిన దుశ్చేష్టను నిప్పు లేక ప్రేలుడు పదార్థము ద్వారా చేసినపుడు శిక్ష.

438. "పై కడపటి పరిచ్ఛేదము లో వివరింపబడిన దుశ్చేష్ట నిప్పు ద్వారా గాని, ప్రేలుడు పదార్థముద్వారాగాని చేయు, లేక చేయుటకు ప్రయత్నించు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని, శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

దొంగతనము మొదలగునవి చేయు ఉద్దేశముతో జలయానమును ఉద్దేశపూర్వకముగ మెరకతట్టు లేక దరి తట్టునట్లు చేసేనందుకు శిక్ష

439. ఏదేని జలయానమును, అందులోని ఏదేని ఆస్తిని దొంగిలించు, లేక అట్టి ఏదేని ఆస్తిని నిజాయితీ లేకుండ దుర్వినియోగము చేయు ఉద్దేశముతో గాని, ఆస్తి ఆట్లు దొంగిలించబడ వచ్చును, లేక దుర్వినియోగము చేయబడవచ్చునను ఉద్దేశముతో గాని, మెరక తట్టునట్లు లేక దరితట్టునట్లు ఉద్దేశపూర్వకముగ చేయు వారెవరై నను పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

మరణము లేక ఘాత కలిగించుటకు సన్నాహము చేసిన పిమ్మట చేయబడిన దుశ్చేష్ట.

440. ఏ వ్యక్తి కై నను మరణము, లేక ఘాత లేక అక్రమ అవరోధమునుగాని మరణము, లేక ఘాత లేక అక్రమ అవరోధము గల్గునను భయమును గాని కలిగించుటకు సన్నాహము చేసియుండి, దుశ్చేష్ట చేయు వారెవరై నను ఐదు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతొ శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదును.

ఆపరాధిక అక్రమ ప్రవేశమును గురించి

ఆపరాధిక అక్రమ ప్రవేశము,

441. ఆపరాధము చేయవలెనను ఉద్దేశముతో గాని, ఆస్తి ని స్వాధీనము నందు కలిగి ఉన్న ఏ వ్యక్తినై నను, జడిపించు, అవమానించు లేక చికాకు పెట్టు ఉద్దేశములో గాని, అట్టి ఆస్తిలో, లేదా ఆస్తి పై ప్రవేశించు వారెవరైనను, లేక అట్టి ఆస్తి లో, లేదా ఆస్తి పై శాసన సమ్మతముగ ప్రవేశించియుండి, అట్టి ఏ వ్యక్తి నై నను జడిపించు అవమానించు, లేక చికాకు పెట్టు ఉద్దేశముతోగాని, అపరాధమును చేయవలెనను ఉద్దేశముతో గాని, శాసన విరుద్ధముగా, అచటనే ఉండు వారెవరైనను