పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శవమును రహస్యముగ పాతి పెట్టుట మొదలగునవి చేయుటద్వారా జననమును కప్పిపుచ్చుట.

318. జన్మించుటకు ముందుగాని, జన్మించుటకు తరువాతగాని, జనన సమ యమున గాని, బిడ్డ ఎప్పుడు మరణించినను, రహస్యముగా అట్టి బిడ్డ శవమును పాతి పెట్టి యైనను మరోక విధముగా నై నను అట్టి బిడ్డ యొక్క జననమును ఉద్దేశ పూర్వకముగా కప్పిపుచ్చుటకు ప్రయత్నించువారెవరైనను రెండు సంవత్సవరముల దాక ఉండగల కాల వధికి రెంటిలో ఒక రకపు కారావసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

ఘాతను గురించి

ఘాత.

319. ఏ వ్యక్తి కైనను శారీరకమైనబాధను, రోగమును లేక అంగవైకల్యమును కలిగించువారెవరైనను ఘాత కలుగ జేసినట్లు చెప్పబడుదురు.

దారుణమైన ఘాత.

320. ఈ క్రింది రకము ఘాతలు మాత్రమే “దారుణమైనవి.” అని అనబడును.

మొదటిది :– పుంస్త్వమును పోగొట్టుట.

రెండవది :-ఏ కంటి దృష్టినై నను శాశ్వతముగా పోగొట్టుట,

మూడవది : చెవి యొక్క వినికిడి శక్తి నై నను శాశ్వతముగా పోగొట్టుట.

నాల్గవది; ఏదేని అవయవమును లేక కీలును పోగొట్టుట.

ఐదవది :- ఏదేని అవయ ము లేక కీలు యొక్క పాటవమును నాశనమొనర్చుట, లేక శాశ్వతముగ వికల మొనర్చుట.

ఆరవది ---- తలను లేక ముఖమును శాశ్వతముగా వికృత మొనర్చుట.

ఏడవది :- ఎముకను లేక పంటిని విరుగ గొట్టుట, లేక తొలగదోయుట.

ఎనిమిదవది : ప్రాణాపాయమును కలిగించునట్టి, లేక బాధిత వ్యక్తిని ఇరువది దినముల వరకు తీవ్రమైన శారీరక బాధకు గురిచేయునట్టి లేక మామూలు పనులను చేసికొనజాలకుండునట్లు చేయునట్టి ఏదైన ఘాత.

స్వచ్ఛందముగా ఘాతను కలిగించుట,

321. ఏదేని కార్యము చేయుట ద్వారా ఏ వ్యక్తినై నను ఘాత కలిగించవలెనను ఉద్దేశముతో, లేక తాసు తద్వారా ఏ వ్యక్తి కై నను ఘాత కలిగించగలనని తెలిసియుండియు, ఆ కార్యమును చేసి ఏ వ్యక్తి కైనను తద్ద్వారా ఘాతను కలిగించు వారెవరైనను "స్వచ్ఛందముగా ఘాత కలిగించినట్లు" చెప్పబడుదురు.

స్వచ్ఛందముగా దారుణమైన ఘాతను కలిగించుట.

322. స్వచ్ఛందముగా ఘాతను కలుగజేయునతడెవరై నను, తాను కలిగించవలెనని ఉద్దేశించినట్టి, లేక కలిగించగలనని ఎరిగియున్నట్టే ఘాత దారుణమైన ఘాతయైనచో, మరియు తాను కలుగజేసినట్టి ఘాత దారుణమైన ఘాత యె నచో, “స్వచ్చందముగా దారుణమైన ఘాత కలిగించినట్లు" చెప్పబడును.

విశదీకరణము :- ఒక వ్యక్తి దారుణమైన ఘాత కలిగించవలెనని ఉద్దేశించి, లేక కలిగించగలనని ఎరిగియుండి, దారుణమైన ఘాతను కలిగించినప్పుడు తప్ప, స్వచ్ఛందముగా దారుణమైన ఘాత కలిగించినట్లు చెప్పబడడు. కాని ఒక రకపు దారుణమైన ఘాత కలిగించవలెనని ఉద్దేశించి, లేక కలిగించగలనని ఎరిగియుండి వాస్తవముగా మరొక రకపు దారుణమైన ఘాతను కలిగించినచో, అతడు స్వచ్ఛందముగా దారుణమైన ఘాత కరిగించినట్లు చెప్పబడును.

ఉదాహరణము

'జడ్' ముఖమును శాశ్వతముగ వికృత మొనర్చవలెనని 'ఏ' ఉద్దేశించి లేక వికృతము కాగలదని ఎరిగియుండి 'జడ్' ను ఒక దెబ్బ కొట్టును. ఆ దెబ్బ 'జడ్' ముఖమును శాశ్వతముగా వికృత మొనర్చదు. కాని, 'జడ్' ను ఇరువది దినముల వరకు తీవ్రమైన శారీరక బాధ అనుభవించునట్లు చేయును. 'ఏ' స్వచ్ఛందముగా దారుణమైన ఘాత కలిగించిన వాడగును.

స్వచ్ఛందముగా ఘాత కలిగించినందుకు శిక్ష.

323. 334వ పరిచ్ఛేదపు నిబంధనలు వర్తించు సందర్భములో తప్ప, స్వచ్ఛందముగా ఘాతను కలిగించు వారెవరైనను, ఒక సంవత్సరము దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, ఒక వేయి రూపాయల దాకా విస్తరించగల జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని, శిక్షింపబడుదురు.