పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

121వ పరిచ్ఛేదమును బట్టి శిక్షింపదగిన అపరాధములు చేయుటకు కుట్ర.

121-ఏ. 121వ పరిచ్ఛేదమునుబట్టి శిక్షింపదగిన ఆపరాధములలో దేనినైనను చేయుటకు భారత దేశములో గాని భారత దేశమునకు వెలుపలగాని, కుట్ర చేయు, లేక అపరాధిక బలప్రయోగము ద్వారాగాని ఆపరాధిక బల ప్రదర్శన ద్వారా గాని కేంద్ర ప్రభుత్వము నైనను, ఏదేని రాజ్య ప్రభుత్వమునైనను హడలగొట్టుటకై కుట్ర చేయువారెవరైనను యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

విశదీకరణము : --ఈ పరిచ్ఛేదము క్రింద “కుట్ర ” అగుటకు కుట్ర ననుసరించి ఏదేనీ కార్యము చేయబడుట గాని శాసనరీత్యా చేయవలసిన కార్యము చేయబడకుండుటగాని అవసరము కాదు.

భారత ప్రభుత్వముతో యుద్ధము చేయు ఉద్దేశముతో ఆయుధములు మొదలైన వాటిని సేకరించుట.

122. భారత ప్రభుత్వముతో యుద్ధము చేయు ఉద్దేశ్యముతో గాని, యుద్ధ సన్నద్కలను ఉద్దేశ్యముతో గాని, జనులను, ఆయుధములను, లేక మందుగుండు సామగ్రిని సేకరించెడు లేక యుద్ధము చేయుటకు ఇతర విధముగా సన్నద్ధులగు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరములకు మించని కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని శిక్షింపబడుదురు. మరియు జూర్మానాకు కూడ పాత్రులగుదురు.

యుద్ధము చేయుటకైన పన్నుగడకు వీలు కలిగించు ఉద్దేశముతో కప్పిపుచ్చుట.

123. భారత ప్రభుత్వముతో యుద్ధము చేయుటకు ఒక పన్నుగడ ఉన్నదను విషయమును కప్పిపుచ్చుట వలన అట్టి యుద్ధము జరుగుటకు వీలు కలిగించు ఉద్దేశ్యముతోగాని, ఆట్లు కప్పిపుచ్చుట వలన అట్టి వీలును కలిగించుట సంభవమని ఎరిగియుండి గాని, ఏదేని కార్యము చేయుటద్వారా లేక శాసనరీత్యా చేయవలసిన కార్యము చేయకుండుట ద్వారా ఆ విషయమును కప్పిపుచ్చువారెవరైనను పది సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు. మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

ఏదేని శాసన సమ్మతమైన అధికారపు వినియోగమును బలవంతముగ చేయించు లేక అవరోధించు ఉద్దేశముతో రాష్ట్రపతి, గవర్నరు మొదలైన వారిపై దౌర్జన్యము చేయుట.

124. భారత రాష్ట్రపతి లేక ఏదేని రాజ్య గవర్నరు తన శాసన సమ్మత అధికారములలో వేటినైనను ఏ రీతిగా నైనను వినియోగించుటకు లేక వినియోగించకుండుటకు అట్టి రాష్ట్రపతిని లేక గవర్నరును ప్రేరేపించు లేక బలవంతము చేయు ఉద్దేశ్యముతో,

అట్టి రాష్ట్రపతి పై లేక గవర్నరు పై దౌర్జన్యము చేయు, లేక ఆతనిని అక్రమముగా ఆవరోధించు లేదా అక్రమముగా అవరోధించుటకు ప్రయత్నించు, లేక ఆపరాధిక బల ప్రయోగము ద్వారానైనను, ఆపరాధిక బల ప్రదర్శన ద్వారానైనను హడలగొట్టు లేదా ఆట్లు హడలగొట్టుటకు ప్రయత్నించువా రెవరైనను,

ఏడు సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

124-ఏ. పలికినట్టి గాని, వ్రాసినట్టి గాని, మాటలద్వారా, లేక సంజ్ఞల ద్వారా, లేక దృశ్య రూపణములద్వారా లేక అన్యధా, భారత దేశములో శాసనరీత్యా నెలకొల్పబడిన ప్రభుత్వము పట్ల ద్వేషమునైనను అధికార ధిక్కారము నైనను కలిగించు లేక కలిగించుటకు ప్రయత్నించు లేక అహిత భావమును రెచ్చగొట్టు లేదా రెచ్చగొట్టుటకు ప్రయత్నించు వారెవరైనను జుర్మానా సహిత యావజ్జీవ కారావాసముతోగాని, జూర్మానా సహితమై మూడు సంవత్సరములదాక ఉండగల కారావాసముతోగాని, జుర్మానాతోగాని శిక్షింపబడుదురు.

విశదీకరణము, 1 : “ఆహిత భావము" అను పదమునందు రాజ్య భక్తి రాహిత్యము, మరియు వైర భావము అన్నియు చేరియుండును.

విశదీకరణము 2 : ద్వేషమును, అధికార ధిక్కారమును, లేదా అహిత భావమును రెచ్చగొట్ట కుండ, లేక రెచ్చగొట్టుటకు ప్రయత్నించకుండ, శాసనసమ్మతమైన పద్ధతులద్వారా ప్రభుత్వ చర్యలను మార్చించవలెనను దృష్టితో వాటిని ఖండించుచు చేయు విమర్శ ఈ పరిచ్ఛేదము కింద అపరాధము కాదు.

విశదీకరణను 3 : ద్వేషమును, అధికార ధిక్కారమును, అహిత భావమును రెచ్చగొట్టకుండ లేక రెచ్చగొట్టుటకు ప్రయత్నించకుండ ప్రభుత్వము యొక్క పరిపాలక లేక ఇతర చర్యలను ఖండించుచు చేయు విమర్శ ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధము కాదు.

భారత ప్రభుత్వముతో మైత్రీబంధము కలిగి యుండి,ఆసియాలోనిదగు ఏదేని రాజ్యముతో యుద్ధము చేయుట.

125. భారత ప్రభుత్వముతో మైత్రీబంధము లేదా శాంతియుత సంబంధము గలిగియుండి, ఆసియాలోనిదగు ఏదేని రాజ్య ప్రభుత్వముతో యుద్ధము చేయు, అట్టి యుద్ధము చేయుటకు ప్రయత్నించు లేక అట్టి యుద్ధము చేయుటకు దుష్ప్రేరణ చేయువారెవరైనను యావజ్జీవకారావాసముతో శిక్షింపబడుదురు. దీనికి జూర్మానా కూడ చేర్చవచ్చును; లేక, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షంపబడుదురు. దీనికి జుర్మానా చేర్చవచ్చును; లేక జూర్మానాతో శిక్షింపబడుదురు,