పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అని యనిచిన నచలాహిత
జననియు నిజకార్య[1]సరణి జటికది యెఱిఁగిం
చిన సంతసిల్లి సతిఁ గల
సినయెడ నానాఁటఁ జీర చిక్కెం దెలియన్.

15


మ.

దినచర్య న్నెలలెల్ల నిండిన ధరిత్రీజాని యంశస్థితిన్
గనియెన్ నందననేత నాజటిల రాట్కంజాక్షి యాదిత్యకీ
ర్తన లర్థిం దనరంగ నచ్చరల నృత్యక్రీడ లెచ్చంగఁ గాం
చననిస్సాణధణంధణల్ చెలఁగ నాశల్ తేజరిల్లం దగన్.

16


క.

ఈలీల నిఖిల[2]లక్షణ
శాలిహరి యతీంద్రసతికి జనియించి జయ
శ్రీ లెసఁగ నాటినాటికిఁ
జాలా యీడేరసాగెఁ జక్కఁగ నంతన్.

17


చ.

దశశరహస్తదైత్యకరి తండ్రి యహంక్రియ సంధిలంగ న
ల్దిశలనృనేతలన్ గెలిచి తెచ్చిన కాంచనశక్తి నిష్ఠ దా
నిశితగతిన్ రచించ ధరణీఖగసంహతిరాగహర్షకృ
ద్దశనచలారి దాయి సహితస్థితిచే జనియెన్ కళారతిన్.

18


వ.

ఇట్లు చని సకలదిగంతాయాతహితజనాగ్రజసంతతి తేజరిల్ల సహస్ర
హస్తలేఖారాతి తండ్రి యజ్ఞశాలం జేరి యందఱల సందడి నిలిచె నంత.

19


క.

తారాంతస్స్థలి లేనెల
దారిన్ లాక్షణ్యకళల దనరారిన శై
లారాతి దాయిఁ గని ఖచ
రారి కదియనేగి నిలిచి యానందగతిన్.

20


ఆ.

అతని రాజధాని నాఖ్యఁ దల్లిని తండ్రి
నడిగి కాంచనాసనాగ్ర్య ధాత్రి
[3]నర్థితోడఁ జేర్చి యఖిలార్చనలచేత
సంతసిలఁగ జేసి చక్కనిలిచి.

21
  1. ధరణి (శి.గ)
  2. రక్షణ (ము)
  3. అర్ధి చేర్చి (శి.గ.)