పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అనఘచరిత్ర! నిన్గని జయక్రియఁ జెందితి గానదాచకే
కనకకిరీటహారకరకంకణచిత్రకరత్నచేలచం
దననటచేటికారజితదంతిశతాంగహయాదికాంక్ష లె
ల్ల నడిగినంతనే తనయ లాలన నిచ్చెదఁ గీర్తి హెచ్చెదన్.

22


వ.

అనిన సంతసిల్లి.

23


క.

అన్నరఖాదాగ్రణి గని
చిన్నన్ నా కిట్టికాంక్ష సేయఁగ నేలా
నిన్నడిగిన నీరాదే
తిన్నఁగ జరణత్రయక్షితిన్ హర్షగతిన్.

24


వ.

[1]అని యడిగి.

25


ఉ.

ఎన్న నిశాటకర్త ధృతి నిచ్చితి నీ హృదయాచ్ఛకాండ నేఁ
డన్న ధరాంతరిక్ష[2]నిఖలాశనిశాచరశైలరాణ్ణదీ
కన్నిధికాననత్రిదశ[3]కంధిజనీడజకీలతారలం
దన్నిట దానయై నళినజాండఘటస్థలి నిండె నయ్యెడన్.

26


ఆ.

జగతి నిండ యంఘ్రి సత్యజగత్ స్థలి
[4]కంట జూచినంత హర్షగతిని
యరసి చక్రయంఘ్రియని ధాత యేతెంచి
కదిపి దాని కెఱఁగి గణనఁ జేసి.

27


మ.

కరకాంతర్గత నీరధారల దృఢాకాంక్షన్ జగత్కర్త శ్రీ
చరణాగ్రస్థలిఁ గేల నంటి కడుఁగన్ జాలై ధరన్ జారఁగా
శరజాస్త్రారి [5]రయక్రియం జని శిరస్స్థానిన్ ధరించె న్సదా
హరిదీశత్రిదశాహియక్షఖగసాధ్యశ్రేణి కీర్తించఁగన్.

28


తే.

అంధకారాతి దాల్చిన యట్టిగంగ
యర్కసంతాననరనాథ యత్నసరణి

  1. అనిన యాలించి(శి)
  2. హరిదక్క (శి.గ)
  3. కంధరనీరజ
  4. యంఘ్రి నతని నెత్తి నంఘ్రి నిడిన (శి.గ)
  5. దయంజనించి (శి.గ)