పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

సంతతి లేదని చాలా
చింతించెడి దానికతన క్షితి సకలశ్రీ
లెంతొ తృణాకృతి జేసితి
నంతిం తనరానియార్తి నగలితి ననఘా.

52


చ.

కరిఘట లేల, జిత్రగణికాచ్ఛట లేల, హిరణ్యశాటికా
హరిధనధాన్యరత్నఘటికాచ్ఛదలంక్రియ లేల, నల్దిశల్
స్థిరగతి నేలఁగాఁదగిన తే జది యేల, ననేకచర్యలున్
సిరిగలయట్టి సంతతిని జెందిన యాయెడ లెస్స లన్నియున్.

53


క.

అన నాలకించి యాయజ
తనయాగ్రణి కాంక్ష దెలిసి దరహాసదృఢా
ననుఁడై [1]తా నెరతేనెల్
చినుకఁగఁ జటినేత యాడె సిరి సంధిల్లన్.

54


సీ.

ఆలించితి నిశాచరికథాశ్రేణిఁ
             గర్ణరంధ్రానందకారి గాఁగ
దేలించితి ధరాదితేయాగ్రణిచ్ఛట
             లిష్టార్థసంసిద్ధి హెచ్చరించ
నేలించితి ఖచరస్త్రీల శాతాసిచే
             రణధాత్రి నరిరాజరాజిచేత
గాలించితి దిగంతఖలజనసంతతి
             దిశియించనీక క్రిందికి దిగంగ
శరశరచ్ఛరదానంత చంద్ర చంద్ర
హార నీహారతారకా తారహార
సితయశ[2]స్థగితా చక్రశిఖరిదేశ!
తతదయాసాంద్ర! దశరథక్షితితలేంద్ర

55


[ఉ.

[3]ఐనను సూనహీనుఁడగునట్టిడు ధారుణిలోన "సూనుఁడా
సూనుఁడ” యంచుఁ జింతఁ గనుచున్ జరియించును నించుకేనియున్

  1. తే నెరతేనెల్ (ము)
  2. స్థదితా (ము)
  3. 55 నెం. పద్యమునుండి 75 పద్యమువరకు 'ము'లో కుండలీకరణ ముంచి యథస్సూచిక నిట్లు వ్రాసిరి -
    "[ ] ఈగుఱుతుల మధ్యనున్న పద్యము లక్కడికథ శిథిలమైపోవుటచే దిరుగవ్రాయబడియె నిందలి తప్పులొప్పులు పరిగ్రహింపవేడెద - ఇట్లు లేఖనకర్త”