పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నూనఁడు తుష్టి నెంతయును నుండినశ్రీలను జూచికొంచు దా
గాన సుతుండె శ్రీల కిలఁ గర్తయు సంశ్రయుఁడైన యాతఁడున్.

56


శా.

కానన్ నేనిడు నాజ్ఞ నింకను దలన్ గైకొంచు సంతుష్టి నో
జ్యానాథా! తగు [1]నిష్టిఁ జేయ నెదలో సంధించి సూతీచ్ఛ, నా
గా నాఱేఁ డది యాలకించి యటులం గానిండు ధన్యుండ
నైనాఁడన్, యతిచంద్ర! యంచు ననఁగా నారాజుతో సూతుఁడున్.

57


సీ.

అను నిట్లు నరనాథ! యంగదేశుండు
             తనధారుణిని జలధరునిరాక
లేక సస్యాళులుఁ గాకుండ జనులకు
             దారిద్ర్యదశయును దనరజూచి
ఛాతీసురేంద్రులఁ దా గాంచి యయ్యలా
             రా! యిట్టులయ్యెనే నరయ నెద్ది
సేయంగఁ జెల్లునో జెచ్చెర నానతిం
             డని యడుగంగ నాయార్యులెల్లఁ
దగిన సరణిని నెదలఁ జింత యొనరించి
యనిరి "కానను ఋష్యశృంగాఖ్యయోగి
నిష్టనూనెను నొకకొండి నెగడు నుదుట
నతని, కాతని గొనిదేర నగు నిచటకు."

58


మ.

అతనిన్ దోడ్కొని తెచ్చి యిచ్చటకు రాజా! నీసుతన్ శాంతఁ ద
త్సతిగాఁ జేసిన లోలుఁడై చెలఁగు నాతం డాతనిం దేరగా
క్షితిలో నేరికిఁ జేతఁగాదు గణికాస్త్రీల్ దేగలారన్న నా
నతి గైకొంచు నరేంద్రుఁ డాసతులఁ దా నంచెన్ జటిన్ దేరగాన్.

59


ఆయోగీంద్రుని దోడితెచ్చి నరనాథాగ్రేసరుం డంత నా
శ్రీయుక్తుం గడునర్చఁ జేసి, తనయన్ జేకూర్చి సంతుష్టిఁ ద
జ్జాయంగా నిజధాత్రి నార్తి క్షతిఁ జెందన్ రాజిలెన్ గాన ధా
త్రీయోషేశ! యతండు రాఁగఁ దగునర్థిం జేయు నీయిష్టికిన్.

60
  1. నిష్ట (ము)