పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గురుచంద్రు లొకలక్ష తిరునామధారులు
             [1]నలమ దిగ్విజయార్థమై గమించి
యనుకూలుర గ్రహించి యన్యుల బోధించి
             చెనఁటుల శిక్షించి శ్రీమతంబుఁ
బూని శేషాంశసంభవులైన లక్ష్మ
ణార్యు లష్టదిశల్ గలయంగ నిలిపి
తిరిగి శ్రీరంగధాముని ధృతిభజించి
చేరవచ్చిన, నాస్వామిఁ జెంగలించి.

15


క.

కంటిన్, లక్ష్మణమునివరుఁ
గంటిన్ గూరేశ దేశికస్వామి మరిం
గంటి నదెవ్వరన, మరిం
గంటి [2]మహాన్వయము దనరె గణ్యం బగుచున్.

16


గీ.

సలలితాసూరికుడిచే బ్రశస్తిఁ గన్న
సాధుభట్టారకుఁడు రంగశాయి వలన
నిల మరింగంటివా రన్నయింటిపేరు
గురుశిఖామణు లెన్నఁగా బరిఢవిల్లె.

17


సీ.

ఆసాధుభట్టార కాత్మజుఁడై దయా
             కలితశీలుఁడు పిళ్లగారు పుట్టె,
నతనికిఁ బెరియ పిళ్లాఖ్యుఁ డాఘనునకు
             శ్రీరంగనాథదేశికుఁడు వొడమె,
నతనికి దీర్థచారయ్య యాసూరికిఁ
             జీయగారలు జనించిరి ప్రసిద్ధి
నతనికి యామునుఁ డాభవ్యమూర్తికి
             మాధవగురుఁడు సమ్మతిగఁ గల్గె
నతనికి ఫలించె సకలరాజాధిరాజ
రాజమకుటాగ్రఘటితచిరత్నరత్న

  1. నలరి (సా)
  2. మహాన్వయు నగణ్యుఁ గౌతుకి నగుచున్ (సా)