పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవి వంశావతారవర్ణనము

సీ.

తనతపస్సామర్థ్యమున జరఠత్వంబు
             విడి వయశ్శాలియై విస్తరిల్లె
ధనవంశజు లనేకధనపుత్రరూపవి
             ద్యాశీలురై మీర నతిశయిల్లెఁ
దనధర్మపత్ని యుత్తమసాధువర్తన
             కనసూయ కెనయన వినుతి గాంచెఁ
దనసత్యనిష్ఠ మాధవశంకరసరోరు
             హాసనుల్ తలలూఁచ నత్తమిల్లెఁ
దనదు సాహాయ్యమునకు గౌతమవశిష్ఠ
కౌశికాత్రిభరర్వాజకణ్వజామ
[1]దగ్న్యపాత్రముఖార్యులు దలఁప నలరె
దానసౌశీల్యధాని మౌద్గల్యమౌని.

12


క.

ధరనిట్టి మునివరాన్వయ
శరధికి గౌస్తుభముపోలె సద్గుణకార్యా
భరణస్ఫురణంబులతో
బరఁగిన యాసూరి సాధుభట్టరుఁ డలరెన్.

13


తే.

అనఘుఁ డాసాధుభట్టారకాహ్వయుండుఁ
గూరనాయకదేశికకుంజరంబు,
ముదిలియాండానుఁ, డీఘనుల్ ముగురుఁ గొల్వ
నవని విలసిల్లె లక్ష్మణయతివరుండు.

14


సీ.

శ్రీలొప్ప బండ్రెండువేలత్రిదండిస
             న్న్యాసులు సప్తసహస్రసంఖ్యు
లేకాంతి జనపర మైకాంతివరులు డె
             బ్బదినాల్గుపేరులఁ బరగినట్టి

  1. దగ్నిహోత్ర? (సా)