పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అట జక్రాంశజరాజకర్త సరగన్ హర్షాతిహృచ్ఛాలియై
కటకాలంక్రియలెల్ల జేసి [1]కణవత్ఖంఖాణదంతీరథ
చ్ఛటలన్ శానలకాహళావకఘటాఝంకారఢక్కాదిగా
రట దత్యంతధణంధణల్ నలుదిశల్ [2]రంజిల్లఁగా దా నటన్.

261


చ.

చని ఖరహంత యాదికృతసంధిలనిచ్చినదాశ కైకయీ
తనయ దరాధినేత లసదాగతి ధిక్కరణాతిశీఘ్రన
ర్తన దినచర్యలం గలసె ధాత్రిదిగంతహితక్షితీశతల్
గని ధనరత్నదంతిరథకాండఘటల్ సిరికాన్క లియఁగన్.

262


ఆ.

ఇట్లు దలరి యెదిరి కేతెంచి దశరథయగ్రతనయశశికి నతనిసతికి
కాళ్ల కెరిఁగి లేచి గణియించి దాయిచే
గడఁగి యతనిఁ గాంచి కౌఁగిలించె.

263


తే.

అహితహరణాఖ్యగలదాయి యట్టిచెంత
జరణకంజాల కెరగిన జక్కనెత్తి
కదిసి జననీత్రయిని గాంచి కాళ్ల కెరిఁగి
ఘనతనీయ తదాశిషల్ గాంచి రచట.

264


క.

అంత కిరాతాగ్రణిఁ గని
సంతసగతి నతనిపతికి సహజస్నేహా
త్యంతదయాజనితనిజహృ
దంతరియై తాటకారి యలరించె దయన్.

265


క.

ఆదైత్యాగ్రణి వారిని
సాదరగతి కౌఁగిలించి సంతసిలెఁ దగన్
యేదెసఁ గాంచిన జయజయ
నాదక్రియ లెసఁగ గీతి[3]నర్తన లలరెన్.

266


వ.

అట్టి యెడ.

267
  1. కణకక్కంఖాణ (ము)
  2. రంజిల్ల గందరెన్ దగన్ (ము)
  3. గీర్తనర్తన (ము)