పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నగరిజనగణన లెచ్చఁగ
జగతి యదరఁగా హళాదిఝర్ఝర లెసఁగన్
అగణితఢక్కాధణధణ
ఖగసంతతి దద్దరిల్ల గ్రక్కన గదలెన్.

268


ఆ.

కదలి గంగ గడచి కాంక్షచే యక్షేశ
యాన ధాత్రి డిగ్గి హర్షలీల
సరగదాని ధనదసంగతికై యంచి
రాష్ట్రదంతి నెక్కె రాజకర్త.

269


క.

చక్రాంశజాతదాయిన్
చక్రీశాంశగలదాయి సరగ రయగతిన్
చక్రికి నీకడ నాకడ
చక్రీచక్రియలఛత్రశర్ఙధృతిగతిన్.

270


తే.

ఏనిగల నెక్కి తగఁ దాల్చి యిద్ద ఱరుగ
చరణరక్షల కడదాయి చేత దాల్చి
కరటికంఖాణరథరాజి ఘనత నెక్కి
గీశరాత్రించరేశితల్ కెలన రాగ.

271


ఆ.

అందలాలయంద యట జననీత్రయి
ధరణితనయఁ గదిసి తరలిరంత
రాజధానిఁ జేరరా నట్టిశృంగార
కాంతి యన్నిదిశల గాననయ్యె.

272


తే.

నిర్జరాధీశ శిఖికాల[1]నిర్జరారి
కంనిధీనేత యని యక్షాధినాథ
శంకరాదిదిగేశితల్ సరసలీల
గణన లెచ్చంగ రెండెడ గలసి రాగ.

273


తే.

అఖిలదేశనరేశిత లచట గదిసి
సందడి దనర్చి యేతేర సరగనంది

  1. నిరజతీశ (ము)