పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గణన కెక్కినయట్టి కలితరత్నశ్రేణి
             సిరినిండరాశిగా జేసిరనఁగ
నంధకారాతి నాఁడైన తియ్యనికాయ
             జాంచితసచ్ఛాయల ల్లనంగ
సారణాదితినందనసాధ్యసిద్ధ
నాగయక్షాండజాతకిన్నరనిశాచ
రాంగనాసంచయాఖ్యాదితాతిశయత
జనకకన్యక రంజిల్లై సాంద్రకళల.

207


తే.

తెలియకర లేనియట్టి లేఁనెల యనంగ
సానదీర్చిన యగ్గజశస్త్రిజాడ
కంటి [1]కంకిరియై చాలఁ గాన నయ్యె
జనకనందన తా జగజ్జనని యనఁగ.

208


వ.

ఇ ట్లలంకరించి నిర్జరశ్రీ లాచ్ఛాదించఁ దే రెక్కించి దాశరథి యగ్రస్థలి
నిల్కడఁ జేసిన.

209


ఉ.

అంతట సీత గాంచి యతఁ డాగ్రహదృష్టి నిరాకరించినన్
జింతిలనేల యగ్ని [2]యతచెచ్చెఱఁ జేరెద నందె నాయెడన్
యెంత కలంకయైన శిఖియే కనియాడెడినన్న గ్రక్కునన్
జెంతనె గాకగా ననలచిహ్నల రాజగ జేసినం దరిన్.

210


తే.

నిలిచి నతిజేసి “దహన! నానిల్కడయిల
దాశరథిగాక యన్యునిఁ దలచినట్టి
దేని నాయంగలతిక దహించరాదె
యితర గతిలేని యెడ సీత గతియె సాక్షి."

211


క.

అని కీలిఁ జేరి నిలిచిన
కనకనయని యనలశిఖ లెగందిగ నెగురన్
దన లసదాకారస్థితి
జననాయకహేళిదండ సరగ నయగతిన్.

212
  1. కంకిలియై (ము)
  2. నదె (వ్రా)