పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ఆనగచారి తాఁ దిరుగ నది యథాస్థలి డించనేఁగ లం
కానరనేత యాజ్ఞ నతిగాఢనిశాచరకర్త లార్చి క
య్యాన నెదిర్చినం గడఁగి యందఱలన్ జలరాశి నేసె లే
ఖానకదంధణల్ చెలఁగ నష్టదిగీశిత లెల్ల నెన్నఁగన్.

95


క.

అలయ కరశక్తి నగ్గిరి
నలయక తానాంజనేయవారి యేఁగి యథా
స్థలి డించి తిరిగిరా నెల
కేలన నిలిచెఁ ద్రిదశరాజి కీర్తించగన్.

96


వ.

అంత నక్కడ.

97


తే.

ఆదశాననరాక్షసాధ్యక్షహేళి
చింతఁ దనదేశికాగ్రణిఁ జేరవేఁగి
యానతి రచించి యర్హసింహాసనాగ్ర
ధర నధిష్ఠించి యాడె [1]నాదరణసరణి.

98


క.

ఏ యెడఁ గీటంటంగా
నీయక జయకార్యచర్య లీడేర్చంగా
నీయాజ్ఞ నేటిదనుకన్
ఆయతగతి నలరినాడ ననఘచరిత్రా!

99


చ.

కలనఖరారిచండకరకాండశరాసనశాతశస్త్రధా
రల ఘటకర్ణనాకగృహరాజజిదాదిహిత క్షితీశరే
ఖల ఘనగంధనాగరదకాండ నిశాటసహాయతన్ ధరా
స్థలిఁ దెగటార్చె నీసరణి దాచఁగ నేటికి దేశికాగ్రణీ!

100


వ.

అని యాడిన లంకానేతం గాంచి.

101


క.

ఇన్నాళ్లదనక [2]చింతా
కన్నెరగఁగలేక యార్తిగాసాగె నహా!

  1. సాదరణ (శి)
  2. నింతా (శి)