పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శృంగారకాననక్షితి గాంచి దిగజారి
             యందలి సరసినీరాన గరచి
నట్టినక్రాగ్రణి హరియించి స్త్రీయైన
             దాని నిర్జరరాజధాని కనిచి
నిష్ఠత జట్యాకృతి నిలిచిన తాటకా
             జాతజాతనిశాటనేతఁ గదిసి
కంధరస్థలిఁ గరశాఖ గట్టి యాస్య
కర్ణనాసికలం దసృక్కాండధార
లడర నలినలిగా రాచి యచలనేసి
నిగిడి యక్షయగతి నింగి కెనసి యంత.

89


చ.

అనిలజ[1]కీశనేత సనయక్రియచేతనదానక్షీర కాం
డనిధియ దాట చంద్రగిరి డాసిన నద్రి గ్రహించి యడ్డగిం
చిన ఖగసేనలం గెలిచి శీఘ్రతగాఁ జని దారిలో నెది
ర్చిన రజనీచరేశితలఁ జెండి జలస్థలి నేసె నయ్యెడన్.

90


చ.

అనిలసఖాకృతిం గలసి యంచితశక్తి ధరించి కైకసీ
జనయిత యన్నతోఁ గదియసాగిన యాతని కేల గట్టి నీ
రనిధి జరీననేయనహిరాజజగత్స్థలి జారి నిల్చెనా
యనిలజకీశకర్త కహాహా! సరి గల్గెదరే జగత్రయిన్.

91


ఆ.

అంత నాంజనేయహరి దెచ్చినట్టి యాయద్రిచేత ఖరనిశాటహంత
దాయి లేచినిలచెఁ ధరణి యాఖండల
దిగ్ధరిత్రి కొంత తేజరిల్ల.

92


వ.

అయ్యెడ.

93


క.

కని దాశరథి సదాగతి
తనయ హరిం జేరనేఁగి దయచే నాలిం
గనరచనఁ దేల్చె నిర్జర
జనకీర్తన లష్టదిశల సంధిల నచటన్.

94
  1. కేళనేన (ము)